ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వైదొలిగారు. మంగళవారం అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు ను కలసి ఆయన ఎదుటే తప్పుకొంటున్నట్లు చెప్పేశారు. ఆమె అనూహ్య నిర్ణయం చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అంతకుముందు రోజే అంటే గత సోమవారం(30న) సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఆమె చంద్రబాబుతో కలిసి తిరుపతిలో ధర్మపోరాట సభలో పాల్గొన్నారు. ఆయనతో పాటే ముందు వరుసలోకూర్చున్నారు. ఇది జరిగి 24గంటలైనా గడవకముందే మంగళవారం ఆమె అమరావతి లో చంద్రబాబును కలసి నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పడం గమనార్హం.
అసలేం జరిగిందంటే ..
టీడీపీ పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని గల్లా అరుణ వర్గం తీవ్ర అసంతృప్తితో, నిరాశా నిస్పృహలతో ఉందని సమాచారం. ఆమె కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, జనబలం, అర్థబలం ఉన్నా టీడీపీలో తగి న గుర్తింపు లేదని.. జిల్లాలో రెండున్నరేళ్ల కింద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాగా.. అరుణకే అవకాశం దక్కుతుందని గట్టిగా నమ్మారు. అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడికి లభించింది. అప్పటి నుంచి మొదలైన అసంతృ ప్తి.. పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వడంతో మరింత రాజుకుంది. దీంతో ఇప్పుడు వైసీపీలోకి చేరుతున్నారని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని..అందుకే వైసీపీలోకి చేరుతున్నారని వైసీపీ అభిమానులు ఆనందంతో ఈ వార్తను తెగ షేర్ల్ చేసుకుంటున్నారు.