దాచేపల్లి అత్యాచార సంఘటనపై వై సీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేప్ కేసుల నిందితుల్లో ఎక్కుమంది అధికారపక్షాలనికి చెందిన వారే వున్నారని, అందుకే న్యాయం జరగడం లేదని అయన ట్వీట్ చేశారు.
A 9yr girl brutally raped by a 50yr man & his son in Dachepalli,Gtr Dt.Many such ghastly incidents reported in AP in past months. As majority culprits are of TDP,they aren't properly brought to justice,causing rise in these crimes.@ncbn aren't you responsible for no action taken?
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2018
‘9 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి, అతని కొడుకు పాశవికంగా అత్యాచారం చేశారు. ఏపీలో కొన్నాళ్లుగా ఇలాంటి ఘాతుకాలు సాగుతున్నాయి. నేరస్తుల్లో ఎక్కవ మంది టీడీపీకి చెందిన వారే కావడంతో న్యాయం జరగడం లేదు, నేరాలు పెరిగిపోతున్నాయి’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి కేసుల్లో తగిన చర్యలు తీసుకోని సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా అని ప్రశ్నించారు. కాగా దాచేపల్లి బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుని, దోషులను బహిరంగంగా ఉరితీయాలని స్థానికులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.