అమెరికా దేశానికి చెందిన మెలోడీ అనే మహిళ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ప్రజా సంకల్ప యాత్రతో ప్రజాదారణ చూరగొంటూ.. వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ చేస్తున్న వైఎస్ జగన్‌ను అమెరికాకు చెందిన మహిళ తన కుటుంబ సమేతంగా కలిసింది. జగన్‌ను కలిసి తరువాత జగన్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది మెలోడీ.
see also : డైరెక్ట్ చంద్రబాబుకే చెప్పి…గల్లా అరుణకుమారి సంచలన నిర్ణయం..!
అయితే, జగన్ గురించి మెలోడీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..
నేను జగన్ గారిని ఒక రాజకీయ నాయకుడిఆలా చూడటం లేదు.
రాజకీయ నాయకుల ఓట్ల గురించి ఎన్నో మాటలు చెప్పుతారు.
తరువాత మాటమీద నిలబడరు.
కానీ.. జగన్ గారు రాజకీయాల్లో ఎక్కడా రాజీ పడకుండా నిజాయితీగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
జగన్ గారు పాదయాత్రలో ఎంతోమందిని కలుస్తున్నారు. కాని ఎక్కడా విసుగు చెందినట్లు కనబడరు. ప్రజలు అతని మీద పడుతున్నా.. అతనితో ఫోటోలు తీసుకోవటానికి పోటీ పడుతున్నా ఎవరినీ కాదనని వ్యక్తిత్వం జగన్‌ది.
చాలా సందర్బాల్లో అతనే సెల్ఫీ తీసి ఇస్తారు. అందరిని ఎంతో సంతోషంగా కలుస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇదంతా అతను ప్రచారం కొరకు చేయటం లేదు. ప్రజల కొరకే అని స్పష్టం అవుతుంది.
మేము జగన్ గారిని కలవటానికి కుటుంబ సమేతంగా వెళ్లాం. ఇంకా చెప్పాలంటే నేను నా ఇద్దరు కూతుళ్లు, మాతోపాటు ఎంతో మంది వచ్చారు. ఆ తోపులాటలో మా చిన్నమ్మాయి కిందపడి ఏడ్వటం ప్రారంభించింది.
వెంటనే జగన్ గారు మా చిన్న కూతుర్ని ఓదార్చారు. ఏదో మాట వరుసకు కాదు. మా కూతురు ఏడుపు ఆపే వరకు. తను ప్రతి ఒక్కరి బాగోగుల గురించి ఎంత తపిస్తారో అందులో మాకు కనపడింది.
రాజశేఖర్‌రెడ్డి ప్రజల కోసం చేశారు. జగన్‌కు ఆ ప్యాషన్ ఉంది. ఫుల్‌గా ప్రజల కోసం చేస్తారు. నా తెలుగు మంచిది కాదు.. రాజశేఖర్ అడుగ్లోలో పాత విధానం వెళితే.. న్యూ స్టేట్ ఎలా బతుకుతుంది. కొత్త ఆశ వెళ్లాలి. జగన్ ఆ ప్యాషన్ ఉంది.
జగన్ మాత్రమే ఏపీకి న్యాయం చేయగలరు అంటూ తన ప్రసంగాన్ని ముగించింది మెలోడీ.