ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కలలు కంటున్నారు. ఆ కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయి. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2019లోనే కాదు.. ఎప్పటికీ సీఎం కాలేరు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా ఇకపై గెలవలేరు. ప్రజలు గెలవనీయరు అంటూ జగన్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also : హైదరాబాద్‌లో తల్లి ఉంటే…కొడుకు కర్నూల్ జిల్లా నుండి వచ్చి దారుణంగా ..!
కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అలాగే, ఏపీ రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని గుర్తించిన ప్రజలు 2019లో కూడా టీడీపీకే అధికారం కట్టబెట్టేందుకు నిర్ణయించినట్లు తమ సర్వేలో తేలిందని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబును ఏం చేయలేక పోయారు.. అటువంటిది ఆర్థికనేరస్థుడిగా పేరొందిన నీవు కూడా చంద్రబాబును ఏం చేయలేవంటూ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు.