2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ,వైసీపీ అత్యధిక సీట్లతో విజయడంఖా మొగిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుకుమార్ రాజు దర్శించుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గ్రాఫ్ పడిపోయింది ..ఇంకా రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని అయన అన్నారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు… తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగరంలో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి, అక్కడి నుంచి ముళ్ళే మూట సదురుకొని వచ్చి విజయవాడలో మకాం పెట్టారని అన్నారు.2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని… త్వరలోనే అవినీతిని బయటపెడతామని అయన పేర్కొన్నారు.