ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలతో 152వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాళెంలో ప్రారంభించి బుద్దాలపాళెంలో ముగిస్తారు.
see also : డైరెక్ట్ చంద్రబాబుకే చెప్పి…గల్లా అరుణకుమారి సంచలన నిర్ణయం..!
అయితే, బుధవారం జగన్ చేపట్టిన 151వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జగన్ తన పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో.. ఓ వృద్ధురాలు తన సమస్యలను తెలుపుకునేందుకు జగన్ వద్దకు వచ్చే క్రమంలో కళ్లు తిరిగి పడిపోయింది. ఆ ఘటనను గమనించిన వైఎస్ జగన్ ఆ వృద్ధురాలిని వెంటనే జగన్ తన స్వహస్తాలతో పైకిలేపి.. తన చేతిలోని వాటర్ బాటిల్ నీళ్లు తాగించాడు. ఈ సంఘటనను గమనించిన ప్రతీ ఒక్కరు.. వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు.. ప్రజా నాయకుడు అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు.