2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు గుప్పించి.. ప్రజలను మోసం చేసి మరీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలనుంది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే ఎన్నికల భయం మొదలైందని, 2019లో టీడీపీ ఓటమి చెందబోతుందన్న సమాచారం చంద్రబాబు చెవిన పడటమే అందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, 2019లో చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడానికి ఎనిమిది అంశాలను రాజకీయ నాయకులు సూచిస్తున్నారు. ఓ సారి ఆ ఎనిమిది అంశాలేమిటో మనమూ ఓ లుక్కేద్దాం.
1. ప్రత్యేక హోదా..!
ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, తెచ్చే బాధ్యత మాదంటూ టీడీపీ జతకట్టి, ఇవ్వకపోతే ప్రశ్నించే బాధ్యత మాదంటూ జనసేన.. ఈ మూడు పార్టీలు కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై కేవలం రెండు శాతం ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి.. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? అని ప్రజలనే ఎదురు ప్రశ్నిస్తూ, కోడలు మగ బిడ్డను కంటే.. అత్త వద్దంటాదా.? అన్న సామెతలను వల్లవేస్తూ ప్రత్యేక హోదా బదులు.. ప్రత్యేక ప్యాకేజీనే బెటర్ అనే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు వత్తాసు పలుకుతూ కాలాన్ని వెల్లదీసిన విషయం తెలిసిందే. చివరకు చంద్రబాబు తనపై ఉన్న కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాను కేంద్రం కాళ్లపై తాకట్టు పెట్టారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
2. టీడీపీ శ్రేణులపై ప్రజల్లో వ్యతిరేకత..!
2014 ఎన్నికల తరువాత అధికారం చేపట్టిన చంద్రబాబు అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని టీడీపీ శ్రేణులకు దోచిపెట్టారన్నది ప్రధాన విమర్శ. అంతేకాకుండా, చంద్రబాబుకు మించి టీడీపీ శ్రేణులపై ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పట్నుంచి.. ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతుండటం మరో వివేషం. అందులోను మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వారు సామాన్యలపై దాడులకు పాల్పడ్డ ఘటనలు వందల సంఖ్యకు పైమాటేనన్నది రాజకీయ విశ్లేషకల మాట.
3. టీడీపీకి తగ్గనున్న ఓట్లు..!
2014 ఎన్నికల్లో వైసీపీపై రెండు శాతం ఓట్ల తేడాతో గెలిచి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులోను బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీతో జతకట్టడంతోనే టీడీపీకి రెండుశాతం ఓట్ల మెజార్టీ వచ్చిందన్నది జగమెరిగిన సత్యం. అయితే, 2019 ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి మారనుంది. ఇప్పటికే చంద్రబాబు సర్కార్ అవినీతి పేట్రేగిపోవడంతో టీడీపీకి బీజేపీ కటీఫ్ చెప్పగా.. మరో వైపు జనసేన అధినేత కూడా టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. దీంతో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం భారీగా తగ్గనుందని రాజకీయ విశ్లేషులు అభిప్రాయపడుతున్నారు.
4. హామీల అమల్లో జాప్యం..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీల్లో నిరుద్యోగ భృతి, షరతులు లేకుండా రుణమాఫీ, పరిశ్రమల స్థాపన ప్రధానమైనవి. అయితే, ఇప్పటి వరకు నిరుద్యోగులకు భృతి ఇవ్వకపోగా.. రైతులకు రుణమాఫీ అసలే జరగలేదు. అంతేకాకుండా ఏపీకి పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ సమస్యను పాలద్రోలుతానని చెప్పిన చంద్రబాబు.. చివరకు ఆ హామీని కూడా మరిచారు. ఈ అంశం కూడా 2019లో చంద్రబాబు సర్కార్ ఓటమికి కారణం కానుంది.
5. నూతన రాజధాని నిర్మాణం..!
హైదరాబాద్‌ను తలదన్నే రాజధానిని నిర్మిస్తా.. నన్ను గెలిపించండి అంటూ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రజలనుద్దేశించి అనేక ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. అదిగో రాజధాని.. ఇదిగో రాజధాని అంటూ ఇప్పటి వరకు కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పటికి కూడా రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి కూడా పడకపోవడం గమనార్హం.
6. కాపుల రిజర్వేషన్..!
కాపుల రిజర్వేషన్ అంశం కూడా 2019 ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ ఓటమికి ప్రధాన కారణం కానుంది. అయితే, 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక మాత్రం.. రిజర్వస్త్రసన్ అమలు చేయమని ముద్రగడ ఉద్యమిస్తే..ఆ ఉద్యమాన్ని తన అదికార బలంతో పోలీసులను ఉపయోగించి అణచివేశారు.
7. టీడీపీ శ్రేణుల మధ్య విభేదాలు..!
ఏపీలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. మొన్నటికి మొన్న మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు సీఎం చంద్రబాబు ముందే బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, విశాఖ జిల్లాలోని ఇద్దరు మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీ గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.
8. నియోజకవర్గాల పెంపు..!
2014 ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లతో మాత్రమే విజయం సాధించిన టీడీపీ.. ఆ తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రతిపక్షాన్ని మరింత బలహీన పరిచే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు సర్కార్ కోట్ల రూపాయల మూటలు చూపి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరుగుతానే ఆశ మరొకటి. అయితే, నియోజకవర్గాల పునర్విభజన ఉండవన్న సంకేతాలను మోడీ సర్కార్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు ఒక్కసారిగా డీలా పడిపోయారు. దీంతో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కసారిగా డైలమాటలో పడ్డారు.