కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం తమిళనాడులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఏర్పడింది.ఆమె కాన్వాయ్‌పై డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పుల దాడిచేశారు . కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్ స్వరాజ్ అభియోన్ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్ జిల్లాలో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు పార్టీబనూర్ జంక్షన్ వద్ద కాన్వాయ్‌ను అడ్డగించి ఈ దాడి చేశారు . ఊహించని ఈ పరిణామంతో కేంద్ర మంత్రి ఖంగుతిన్నారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆమె తన పర్యటనను కొనసాగించారు