తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా ఈ నెల 10న రై తులకు చెక్కుల పంపపిణీ, పట్టదారు పాసుపుస్తకాలు అందజేయనున్నది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు అ వగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు రైతు సమన్వయ స మితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య బుధవారం పత్రికలకు విడుద ల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, మానకొండూరు ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొంటారు. ఈసదస్సులో జిల్లాలోని 13 మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు సింగిల్ విండోల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొననున్నారు.
