తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రైతు బంధు పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని చెప్పారు .వ్యవసాయంలో ఉన్న ఆనందం మరే వృత్తిలో ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమని చెప్పారు.రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని.. ప్రాజెక్టులు కడుతుంటే..రైతులకు సాయం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నరని కేటీఆర్ మండిపడ్డారు.రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
Minister @KTRTRS addressing the farmers at Rythu Bandhu awareness program in Sircilla. pic.twitter.com/1YLnJR6jUT
— Min IT, Telangana (@MinIT_Telangana) May 3, 2018