తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది.అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. భారీ వర్షాలతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో GHMC హై అలర్ట్ ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దించింది. వాటర్ లాగింగ్స్ లేకుండా చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేసింది.గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.గాంధీ భవన్ నుంచి లక్డీకాపుల్ వరకు రోడ్డు పై వర్షపు నీరు నిలిచిపోవడంతో రెండు కిలోమీటర్ల పొడువునా వాహనాలు నిలిచిపోయాయి. అసెంబ్లీ ఆవరణలో చెట్టు కూలింది. అసెంబ్లీ, ఖైరతాబాద్, నాంపల్లి, ఆబిడ్స్, బషీర్ బాగ్, లిబర్టి, హిమాయత్ నగర్, నారాయణగూడలో గాలి దుమారంతో భారీ వర్షం కురిసింది
Tags heavy rain hyderabad