మామిడి పండ్లు అంటే తెలియనివారంటూ ఉండరు.సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడికాయ ఒకటి.మామిడి పండ్లని వేసవిలోనే తినాలి. అయితే మామిడిపండ్లని వేసవికాలంలో ఎక్కువగా తినడం వలన అధ్బుతమైన లాభాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- మామిడి పండ్లు తినడం వలన చిగుళ్ల ఇన్‌ఫెక్షన్, రక్తం కారడం, దంతాల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది.
- మామిడి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది.
- మామిడి పండ్లలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ అనే పదార్ధం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం బలోపేతం అవుతుంది.
ఉదయాన్నే అరటిపండును తినచ్చా..?
- మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది.
- పచ్చి మామిడి తినడం వలన ఉపిరితిత్తులు శుభ్రపడుతాయి.
- మామిడి పండును తినడం ద్వారా చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
- మామిడి పండును తినడం ద్వారా చర్మ సమస్యలు పోతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- మామిడి పండును తినడం ద్వారా పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
రోజూ ఉదయాన్నే అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలివే..!
- మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.
- మూత్రపిండాలలో రాళ్ళున్నవారు ఒక గ్లాసు మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నెలలు తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోయి, ఇకపై రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.