గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కృష్ణా జిల్లాలో కోనసాగుతుంది. 151వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఆయన మచిలీపట్నం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చిలకలపుడి, సర్కార్‌నగర్, శ్రీనివాస నగర్, పోతిరెడ్డి పాలెం మీదుగా పొట్లపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్‌ను కలుసుకునేందుకు ప్రజలు ఎండను సైతం లెక్కచేయకుండా వస్తున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కొన్ని వేలమంది వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు.
