శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరు .ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద తనదైన స్టైల్ లో పోరాడి దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ నటి .ఆ తర్వాత జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీరెడ్డి మరోసారి సంచలన వార్తకు కేంద్ర బిన్దువైంది .
తాజాగా ఆమె గురించి ఒక అశ్లీల వీడియో ఒకటి నెట్ హాల్ చల్ చేస్తుంది .అయితే ఆ వీడియో తనది కాదు అని ..కొంతమంది కావాలనే తన గురించి అలా ఫేక్ వీడియోలు తయారుచేసి సోషల్ మీడియా ,నెట్ లో పెడుతున్నారు ఆని ఆమె వ్యక్తిగత న్యాయవాది గోపాలకృష్ణతో కల్సి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు .
ఈ క్రమంలో లాయర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ “శ్రీరెడ్డి ఒక మహిళా అని చూడకుండా మార్ఫింగ్ చేసిన ఒక వీడియోను సోషల్ మీడియాలో ,నెట్ లో పెట్టి అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు .వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని ..అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్ళతామని ఆయన మీడియాకు తెలిపారు ..