ఇటివల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ జనసమితి అనే కొత్త రాజకీయ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రో కోదండరాం సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు .ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తమ పేరును నమోదు చేస్కోవాలని కోరారు .
అంతే కాకుండా అర్హులైన ఎవరైనా సరే ఎన్నికల బరిలో దిగాలంటే తమను సంప్రదించాలని ..గ్రామపంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ తరపున బరిలోకి దిగాలని ఆయన పిలుపునిచ్చారు .
ఆయన ఇంకా మాట్లాడుతూ తమ ముందున్న ప్రధాన లక్ష్యం తమ పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే.అందుకు తగ్గట్లు ప్రణాళికలు ,చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు .అంతే కాకుండా పార్టీకి సంబంధించిన మహిళ విభాగాన్ని కూడా త్వరలో విస్తరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు ..