శ్రీరెడ్డి ఎపిసోడ్.. మీడియాపై వార్ తదితర అంశాలతో రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కసరత్తులు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి.. ప్రతి జిల్లాలో రాత్రిపూట బస చేస్తారు.. ఇదే సమయంలో జిల్లాకు వందమందిని ఎంపిక చేసి వారిలోంచి కొంతమందిని ఎంపిక చేస్తారు.. ఇప్పటి వరకు హైదరాబాద్, విజయవాడకు మాత్రమే పరిమితమైన పార్టీ కార్యాలయాలను జిల్లాల్లో సైతం ఏర్పాటు చేయాలని పవన్ సంకల్పించారు. పనిలో పనిగా మధ్యలో రెండు సార్లు విదేశి పర్యటనలు చేసి ఎన్నారైలను కూడా ఆకర్షించాలని జనసేనాని వ్యూహాలు రచిస్తున్నారు.
