ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట యాబై ఒక్క రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులోభాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .
ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో విశ్వబ్రాహ్మణులతో సమావేశమయ్యారు జగన్ .ఈ సందర్భంగా వారు తమ సామాజికవర్గం ఎదుర్కుంటున్న పలు సమస్యల గురించి ..టీడీపీ హయంలో నాలుగు ఏండ్లుగా ఎలా తమ బ్రతుకులు నాశనం అయ్యయో వివరించారు .
దీనికి స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హమీచ్చారు .అంతే కాకుండా ఈ కార్పోరేషన్ ద్వారా విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కై అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు .అక్కడితో ఆగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని కూడా జగన్ హామీ ల వర్షం కురిపించారు ..