ఏపీలో అనంతపురం జిల్లా టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది .జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన పాదయాత్ర ఎఫెక్ట్ టీడీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందని జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో చేయించిన సర్వేలో తేలింది .గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం 14నియోజకవర్గాలకు అధికార టీడీపీ పార్టీ 12 స్థానాలను ,ప్రతిపక్ష వైసీపీ పార్టీ 2 స్థానాలను గెలుపొందింది .
అయితే ప్రస్తుతం జిల్లాలో రాజకీయ పరిణామాలు మారాయి అని మంత్రి పరిటాల సునీత చేయించిన సర్వేలో తెలింది .నాలుగు ఏళ్ళ వ్యవధిలోనే అధికార టీడీపీ పార్టీ ప్రాభల్యం తగ్గింది .అధికారాన్ని అడ్డుపెట్టుకొని బూత్ స్థాయి కార్యకర్తనుండి మంత్రి వరకు అందరూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలకు పాల్పడటమే కాకుండా సాక్షాత్తు మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే తెలుగు తమ్ముళ్ళు పరిటాల పేరు చెప్పుకొని మహిళలని కూడా చూడకుండా దాడులకు తెగబడటం ..హత్యారాజకీయాలను చేయడం ..జగన్ పాదయాత్ర చేయడం ఇలా పలు కారణాల వలన ప్రజలు టీడీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆ సర్వేలో వెల్లడైంది .
అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరల అదే స్థానాలనిస్తే డెబ్బై శాతం మంది ఓడిపోతారు అని తేలింది .మొత్తంగా చూస్తె అధికార టీడీపీ పార్టీకి రానున్న ఎన్నికల్లో కనీసం మూడు సీట్లు వచ్చిన గగనమే అని మంత్రి సునీత స్వయంగా నిర్వహించిన సర్వేలో తేలడంతో ఇటు జిల్లా పార్టీ నాయకుల్లో అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాకిచ్చే విధంగా ఫలితాలు రావడంతో తలలు పట్టుకోవడమే మిగిలి ఉందని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు .
ఇక్కడ వైసీపీ గ్రాఫ్ కూడా పెరగడం కూడా తమ్ముళ్ళ ఆందోళనకు కారణమైంది .అయితే ఇటివల చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి సిట్టింగ్ వాళ్ళకు కూడా మరల చాన్స్ ఇవ్వకపోతే వారు రెబల్స్ గా బరిలోకి దిగితే వచ్చే మూడు స్థానాలు కూడా రావని ఆసర్వేలో తేలింది అంట .మొత్తంగా చూస్తే టీడీపీ పార్టీకి భవిష్యత్తులో గడ్డు పరిస్థితులే ఎదుర్కొనుందని మంత్రి పరిటాల సునీత సర్వేలో తేలడంతో తెలుగు తమ్ముళ్ళు తీవ్ర ఆందోళనలో పడ్డారు ..