రాజకీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజకీయాలకు తగమా అంటూ.. నిర్మాతలు సైతం రాజకీయ అరంగేట్రం చరిత్ర తెలుగు నేలపై ఉంది. నటనా రంగానికి రాజకీయాలకు మధ్య చాలా అనుబంధం సంబంధమే ఉంది. 2009 ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున బరిలో దిగారు. బాగానే ఖర్చు చేసినా.. అప్పటి వైఎస్ దెబ్బకి అశ్వినీకి డిపాజిట్లు కూడాదక్కలేదని అంటారు. ఇక, ఇప్పుడు ఈ పరంపరలోనే నిర్మాత ఒకరు వచ్చే ఎన్నికలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుదిరితే.. ప్రతిపక్షం వైసీపీ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో బిజీగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఆయన కలిశారని, తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కూడా అబ్యర్థించారని సమాచారం.
ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ తరఫున డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గెలుపొందారు. అయితే, వచ్చేసారి ఎన్నకల్లో తనకుఅవకాశం ఇవ్వాలని డి. నాగేశ్వరరావు వైసీపీ అధినేతను కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈయన సినీ రంగంలో మంచి పేరున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేత. ప్రముఖ నిర్మాత. నిర్మాతగా ఈయన సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భారీగానే ఖర్చుచేసే అవకాశం ఉంది. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో సినీ గ్లామర్‌ను బాగా వాడుకోవాలని చూస్తున్నవైఎస్ జగన్‌కు ఈయన బాగానే ఉపయోగ పడతాడని వైసీపీ వర్గాల్లోనూ చర్చ నడుస్తో్ంది.