Home / TELANGANA / ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి..!!

ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి..!!

తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో వైద్య ఆరోగ్య శాఖ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైన్ క్లియర్ చేసింది. అలాగే మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ 3వ బ్యాచ్ 150 ఎంబిబిఎస్ సీట్లకు రెన్యూవల్ ఇచ్చింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలోను 100 సీట్లకు రెన్యూవల్ ఇచ్చింది. మెడికల్ కాలేజీలు సీట్ల పెంపునకు అన్ని విధాలుగా దిశా నిర్దేశం చేసి, సహకరించిన సీఎం కేసీఆర్ కి, mci కి కూడా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 2018-19 ఏడాదికి 150 సీట్లతో సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు 10A of the IMC Act, 1956 చట్టం ప్రకారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది. దీనితో కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇక లాంఛనం మాత్రమే. కాగా, 2018-19 ఏడాదికి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 3 వ బ్యాచ్ 150 సీట్లకు రెన్యూవల్ వచ్చింది. ఇదిలా ఉండగా నిజామాబాద్ మెడికల్ కాలేజి 100 సీట్ల రెన్యూవల్ కి కూడా అనుమతి లభించింది.తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రావడానికి అవసరమైన దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ కి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat