జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.రానున్న ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్దమని తెలిపారు.ఈ మేరకు ఒక ప్రకటన వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జనసేన పార్టీ కార్యకర్తలతో జరిపిన సమావేశంలో అయన మాట్లాడారు.వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పక్కా వ్యూహంతో ముందుకు వేళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యూహ కర్త దేవ్ ను అందరికి పరిచయం చేశారు.