ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇప్పటికే అవినీతి కూపంలో కూరుకుపోయిన సీఎం చంద్రబాబు సర్కార్‌పై సీబీఐ ఏ క్షణంలోనైనా దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాక, మరో వైపు ఏపీ ప్రజల్లో సైతం చంద్రబాబు నాయుడుపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయారు. ఇందుకు నిదర్శనం.. ఇటీవల చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ.. నన్ను సీబీఐ అరెస్టు చేయడానికొస్తే.. మీరంతా వలయంలా నిలబడి నన్ను (చంద్రబాబు) కాపాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే నన్ను కాపాడేందుకు వచ్చే వారంతా రెండు చేతులు పైకెత్తాలంటూ చంద్రబాబు కోరగా.. సభలోని ఏ ఒక్కరు కూడా చేతులెత్తకపోవడం గమనార్హం. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా డైలమాలో పడ్డారు.
see also : ఏపీలో మరో సంచలనం..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి
మరో పక్క ఏపీలో పచ్చమీడియా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. అందులోనూ.. చంద్రబాబుకు, లోకేష్‌కు, పచ్చమీడియాకు ఉన్న సంబంధాన్ని ఇటీవల కాలంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ నుంచి పచ్చ మీడియాకు ఎంత ముడుపులు, ఎవరెవరికి అందుతున్నాయి, పచ్చ మీడియా యాజమాన్యం లెక్కలు, నారా లోకేష్‌తో వారి సంభాషణలను సైతం పవన్ కల్యాన్ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఒక్కొక్కటిగా ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి భాగోతం అంతా బయటపడుతుండటం చూసిన తండ్రీ తనయులైన చంద్రబాబు, లోకేష్‌లకు బీపీ ఏ స్థాయిలో పెరిగి ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు టీడీపీకి కలిసిరాకపోవడంతో.. ఒక రెండు రోజులు రాజీకాయాలకు దూరంగా ఉండేందుకు మంత్రి నారా లోకేష్ నిర్ణయించారట. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం తరుపున అమెరికా పర్యటన పేరుతో రెండు వారాలపాటు అమెరికాలో గడపనున్నారు నారా లోకేష్.