తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు కీలక అనుమతులు లభించాయి.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 7 అనుమతులు లభించాయి.ఇప్పుడు తాజాగా ఇరిగేషన్ ప్లానింగ్, ప్రాజెక్టు అంచనా వ్యాయాలకు సంబందించిన అనుమతులు లభించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతి ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో 237 టిఎంసి ల నీతి వినియోగానికి అనుమతి ఇచ్చింది.
ప్రాజెక్టు అంచనావ్యయం రూ.80,190.46 కోట్లకు కేంద్ర జల సంఘం నిర్ధారించింది. హెడ్ వర్క్స్ పనుల కోసం రూ.33145.44 కోట్లు , నీటి సరఫరా వ్యవస్థ ( కాలువలు , డిస్ట్రిబ్యూటరీలు ) కోసం రూ.47045.02 కోట్లు వ్యయం అవుతాయని ప్రబుత్వమ్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం అంగీకరించింది ఈ అంచనా వ్యయాన్ని మూడేండ్ల వరకు సవరించకూడదని పేర్కొన్నది.
13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు,18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజి నుంచి 195 టిఎంసి ల గోదావరి నీటిని ఎత్తిపోయడానికి కేంద్ర జల సంఘం అంగీకరించింది. యెల్లంపల్లిలో లభ్యమయ్యే 20 టిఎంసి ల నీరు ,25 టిఎంసి ల భూగర్భ జలాలు కలుపుకొని మొత్తం ప్రాజెక్టు నీటి లభ్యత 240 టిఎంసి లు , ఇందులో నుంచి 237 టిఎంసి ల నీరు వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం అంగీకరించింది.
169 టిఎంసి లు సాగునీటికి, 30 టిఎంసి లు హైదారాబాద్ తాగు నీటి అవసరాలు , 10 టిఎంసి లు దారి పొడుగునా ఉండే గ్రామాల తాగు నీటికి ,16 టిఎంసి లు పారిశ్రామిక అవసరాలు , 12 టిఎంసి లు ఆవిరి నష్టం కోసం వినియోగించే ప్రణాళికను కేంద్ర జల సంఘం అంగీకరించింది. 41 సంవత్సరాల సమాచారంతో సిమ్యులేషన్ చేసినప్పుడు 32 సంవత్సరాలు నీటి వినియోగానికి నీరు అందుబాటులో ఉంటుందని తేలిందని సి డబ్ల్యూ సి లేఖలో పేర్కొన్నది. 78 శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ సిమ్యులేషన్ స్టడీస్ పట్ల CWC సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.