ఏపీ అధికార పార్టీ నాయకులు చాలా మంది ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఇతర మతస్తులను గౌరవించడం తెలీదని, వారి సంక్షేమం గురించి ఆలోచనలు చేయడం వైఎస్ జగన్‌కు ఇష్టముండదని పలు సందర్భాల్లో అసందర్భ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా.. ఎలా పడితే అలా ఆధారాలు లేకుండా, అసందర్భంగా వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తూ మోసపూరిత ప్రచారాలు చేస్తున్న నాయకులకు గత శనివారం జరిగిన సంఘటనే సమాధానం.
see also : లోకేష్ అమెరికా పర్యటన వెనుక అసలు గుట్టు రట్టు..!!
అయితే, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత శనివారం జగన్ ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అవినీతిని ఎండగట్టారు. చంద్రబాబు ప్రత్యేక హోదా తెస్తానంటూ ఢిల్లీకి వెళ్లారని, కానీ ఢిల్లీలో జరిగిన విషయం వేరేనంటూ అసలు విషయం చెప్పారు జగన్. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో బ్రోకరిజం చేసేందుకు చంద్రబాబుకు ఢిళ్లీ వెళ్లారే తప్ప… ప్రత్యేక హోదా కోసం కాదన్నారు. ఈ సమయంలోనే బహిరంగ సభ పక్కనే ఉన్న మసీదులో నమాజ్ చేసే సమయం కావడంతో ఒక్కసారిగా జగన్ తన ప్రసంగాన్ని ఆపేశారు. మసీదులో నమాజ్ పూర్తయ్యాక.. జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్ చేసిన ఈ ఒక్క పనికి అక్కడి ముస్లింలంతా ఫిదా అయ్యారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా జగనన్నకే మా ఓటు అంటూ కామెంట్స్ పెట్టడం విశేషం.