అవును, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ బతికి ఉందంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే.. జగన్‌కు నా హ్యాట్సాఫ్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జగన్‌లో చూస్తున్నా..!! ప్రజలను మోసం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తి చూపడంలో, అధికార పార్టీ టీడీపీ చేయలేని విధంగా మాట తప్పని, మడమ తిప్పని పోరాటం చేస్తున్నజగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటూ తెలుగు సినీ ఇండస్ర్టీకి చెందిన సీనియర్ నటుడు విజయ్ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా సాధించే బాధ్యత నాది అంటూ ఏపీ ప్రజలన నమ్మించి మోసం చేసిన చంద్రబాబు.. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించి నేడు ఏమొఖం పెట్టుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటమంటూ నాటకాలు చేస్తున్నారని ప్రశ్నించారు నటుడు విజయ చంద్ర. ఏపీ ప్రజలు చంద్రబాబుకు బుద్దిచెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. తనపై ఉన్న కేసులకు భయపడే సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్నారు.
see also : తిరుపతిలో వైన్ షాప్స్ దగ్గర ధర్మ దీక్ష చేసిన టీడీపీ నాయకులు..!
మాటతప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్‌కే ప్రత్యేక హోదా సాధించే దమ్ము, ధైర్యం ఉందన్నారు. ఏపీ ప్రజల కోసం నాడు సోనియా గాంధీని, నేడు మోడీని ఎదిరించి దమ్మున్న నేతగా జగన్ నిలిచారన్నారు. ప్రజా సంకల్ప యాత్రతో జగన్‌పై ప్రజల్లో ఆదరణాభిమానాలు పెరుగుతున్నాయని, సూర్యుతు తూర్పున ఉదయిస్తాడన్న మాట ఎంత నిజమో.. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అంతే నిజమని మీడియా ముఖంగా చెప్పారు నటుడు విజయ చంద్ర.