వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు.
see also : సిగ్గుందా.. నీవన్నీ దుర్బుద్ధి రాజకీయాలే..!! జగన్‌పై చింతమనేని ఫైర్..!!
చివరకు జగన్‌ను నేరుగా అడ్డుకోలేక, దొడ్డిదారిన జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి అక్రమ కేసులు బనాయించారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ విషయం జగమెరిగిన సత్యమే. అయినా, వైఎస్ జగన్ జంకలేదు. నాడు, దేశంలోని రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి భయపడుతున్న సందర్భంలో.. సోనియా గాంధీని ఎదిరించి మరీ కొత్త పార్టీ పెట్టారు వైఎస్ జగన్. అలా, నాడు సోనియా గాంధీని ధిక్కరించి రాజకీయ పార్టీ పెట్టి వైఎస్ జగన్ చరిత్రకెక్కారు.
see also : రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు..మంత్రి హరీశ్‌రావు
నేడు, ప్రత్యేక హోదా విషయంలోనూ ప్రధాని మోడీపై ఎదురు దాడి చేసేందుకు వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, ప్రత్యేక హోదా సాధిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు తిరుపతి వేంకన్న సాక్షిగా మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారం చేపట్టాక వారు మాట మార్చారని, కానీ, వైఎస్ జగన్ మాత్రం ప్రత్యేక హోదాపై నాటి నుంచి నేటి వరకు ఒకే మాటపై నిలుస్తూ ప్రజలకు అండగా ఉన్నారు.
see also : 2019లో జగన్ అనే నేను..!!
అయితే, జగన్‌పై ఉన్న కేసులన్నీ అక్రమంగా బనాయించినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎల్ రవీంద్ర రెడ్డి తెలిపారు. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన డీఎల్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. జగన్‌పై కేసులు బనాయించేందుకు.. రాసిన కాగితంపై నన్ను సంతకం పెట్టమన్నారు. కానీ, జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించేందుకు కారణం కాకూడదని నేను సంతకం పెట్టలేదు. అయితే, ఆ కాగితాన్నే శంకర్ రావు దగ్గరకు తీసుకెళ్లి మరీ సంతకం పెట్టించారని తెలిపారు. అప్పగికే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు మీరు చేసేది తప్పు అని చెప్పా.. కానీ వాళ్లు అవేమీ వినకుండా నీవు కాకపోతే మరొకరు అంటూ శంకర్‌రావు చేత సంతకం పెట్టించి జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించారని తెలిపారు డీఎల్ రవీంద్ర రెడ్డి.