సీఎం చంద్రబాబును 2019లో మళ్లీ సీఎంగా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా తప్పక సాధిస్తారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల కోసం 2014లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసేందుకు చంద్రబాబుకు ఒప్పుకున్నారన్నారు. అయితే, ఏపీకి ప్రధాని మోడీ న్యాయం చేస్తారని నాలుగేళ్లపాటు చంద్రబాబు వేచి చూశారని, కానీ ప్రధాని మోడీ చివరకు నమ్మించి మోసం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
see also : నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ నేత..!
రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ప్రతిపక్షం.. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టి.. అభివృద్ధిని అడ్డుకుంటుందని వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపడితే.. అందుకు వ్యతిరేకంగా వైసీపీ మరో సభ పెట్టడం దర్మార్గపు చర్య అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.