వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మీడియాతో మాట్టాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన మంచిదేనని, తిరుపతి సభను పక్కదారి పట్టించేందుకు వైఎస్ జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. అయితే, ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని, ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా జగన్‌కు లేదని ఎద్దేవ చేశారు. అయినా, వైఎస్ఆర్ కొడుకుగా ఉండి.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతానంటూ జగన్ ప్రస్థావించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్.
