ప్రత్యేక రాష్ట్రం సాధించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా అభివృద్ది చేస్తారని టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.ప్లీనరీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన టీఆర్ఎస్ ఎన్నారై నేతలు సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను సమర్థించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయానికి తమ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. రూ. 50 కోట్లతో ఎన్నారైల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం పట్ల సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అమెరికా, లండన్ కు చెందిన టిఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు పాల్గొన్నారు.