రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఖాతాలో మరో మణిహారం చేరనుంది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడమే కాకుండా..విదేశాల్లో ప్రయాణం చేస్తున్న అనుభూతిని కలిగించేలా ఆహ్లాదకరమైన ప్రయాణ ఏర్పాట్లు సాగనున్నాయి. ఎల్బీనగర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు సకాలంలో చేరుకోలేక ట్రాఫిక్ రద్దీతో ఇరుక్కుంటున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికై ప్రభుత్వం చింతలకుంట చౌరస్తా వద్ద ఈ అండర్ పాస్‌ను నిర్మించింది. మంగళవారం నాడు ఉదయం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఇతర ప్రజాప్రతినిధులు ఈ అండర్ పాస్‌ను ప్రారంభించనున్నారు.
Third underpass under SRDP being opened up tomorrow & third in a row completed ahead of time
Congratulations to the projects team of @GHMCOnline ? https://t.co/JdFaNYOWIb
— KTR (@KTRTRS) April 30, 2018
అండర్ గ్రౌండ్ వేను విదేశీ టెక్నాలజీతో నిర్మించారు. అండర్ గ్రౌండ్ వే నుండి వెళ్తుంటే విదేశాల్లో వెళ్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. రోడ్లకు ఇరువైపులా అందమైన రంగులతో పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రూ.12.70కోట్ల వ్యయంతో నిర్మించిన చింతలకుంట చెక్‌పోస్ట్ అండర్ పాస్ రేపటి నుండి నగరవాసులకు అందుబాటులో రానుంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఈ అండర్ పాస్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (SRDP)లో భాగంగా చేపట్టిన ఏల్బినగర్ చింతలకుంట అండర్‌పాస్‌ను ప్రారంభించడంతో ఎస్.ఆర్.డి.పికి చెందిన మూడో ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. చింతలకుంట సాగర్ రింగ్ రోడ్ నుండి విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్ కు ఏమాత్రం ఆటంకం లేకుండా వెళ్ళడానికి మొత్తం 540మీటర్ల పొడవునా అండర్ పాస్ నిర్మాణ పనులను GHMC చేపట్టింది. చింతలకుంట చెక్ పోస్ట్ అండర్ పాస్ నిర్మాణ పనులను గడువులోగా నిర్మాణం పూర్తిచేసి నగర వాసుల వినియోగార్థం తేవడంలో జీహెచ్ఎంసీ విజయం సాధించింది. ఈ అండర్ పాస్‌తో చింతలకుంట జంక్షన్ లో 95శాతం ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Hon'ble Minister MA&UD Shri. @KTRTRS will inaugurate tomorrow the Underpass at Chintalkunta, LB Nagar, #GHMC constructed under #SRDP (Strategic Road Development Plan).
All set ready for inauguration. Visuals of the Underpass ? pic.twitter.com/UntLFzUtAa— GHMC (@GHMCOnline) April 30, 2018