ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని దాదాపు నాలుగు యేండ్ల పాటు ఆ అధికారాన్ని అనుభవించిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇటివల విడిపోయిన సంగతి విదితమే .అయితే తాజాగా గత నాలుగు ఏండ్లుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన టీడీపీ ఎంపీ ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి .
టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా ,ఆ పార్టీ ఆర్థిక లావాదేవిల్లో కీలక పాత్ర పోషించే కేంద్ర మాజీ మంత్రి ,ఎంపీ అయిన సుజనా చౌదరి బాబును కాదని బీజేపీ పార్టీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు .
అయితే అప్పటి ఉమ్మడి ఏపీలో 2009 సవంత్సరంలో జరిగిన మరియు గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన సుజనా ఉన్నట్లు ఉండి ఇలా ప్లేట్ మార్చడం ఏమిటి అని అందరు గుసగుస లాడుకుంటున్నారు..