ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమొఖం పెట్టుకుని ప్రత్యేక హోదాపై తిరుపతిలో సభ నిర్వహిస్తావంటూ చంద్రబాబుపై చలసాని శ్రీనివాస్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఇవాళ చలసాని శ్రీనివాస్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
see also : వైఎస్ జగన్‌ను కలిసి కంటతడిపెట్టిన ఎన్టీఆర్ బంధువులు..!!
2014 మార్చి 2న నాటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని తీర్మానం చేసి, ఆ దిశగా ప్రణాళికా సంఘానికి ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక ముందే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నాటి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘానికి ఆదేశాలు జారీ చేస్తే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ ఫైల్‌ను ప్లానింగ్ కమిషన్ కార్యాలయం దాటనీయకుండా తన 40 ఏళ్ల రాజకీయ చాణుక్యతతో అడ్డుకున్నారన్నారు. డిసెంబర్ 31, 2014 వరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ జారీ చేసిన ఉత్తర్వుల ఫైలు ప్లానింగ్ కమిషన్ కార్యాలయంలోనే ఉందని, ఆ సమయంలో ఒక్కటంటే.. ఒక్కసారైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ప్లానింగ్ కమిషన్‌కు లేఖ రాయలేదన్నారు.
see also : టీడీపీ నేతలకు చంద్రబాబు స్ర్టాంగ్ వార్నింగ్..!!
అంతేకాకుండా, 2017 జనవరి 27న ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ ఇస్తున్నామని అరుణ్ జైట్లీ ప్రకటించిన తరువాత, ఆ వెంటనే ఏపీలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కేంద్ర ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారన్నారు. అంతటితో ఆగని చంద్రబాబు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వల్ల ఏం ఒరిగింది..? అలాగే ఏపీకి కూడా ప్రత్యేక హోదా వల్ల ఏం ఒరగదంటూ ప్రకటన చేయడం చాలా బాధకరమన్నారు చలసాని శ్రీనివాసరావు.