తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశకు చేరుకున్నాయి.అందులో భాగంగానే గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని తోగ్గూడెం చేరుకున్నాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటుకు వచ్చాయి. దీంతో, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇక్కడి నుంచి మూడు జిల్లాలకు చెందిన గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు సరఫరా చేయనున్నారు.
రూ.2000 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తి చేసుకోవడంతో మంత్రి సందర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో అనుకున్న సమయానికి పనులను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను మంత్రి తుమ్మల అభినందించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అశ్వరావుపేట ఎమ్మెల్యే-ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.