ఓ వైపు చదువుకోవాలనే ఆకాంక్ష ..మరోవైపు పేదరికం సమస్యలు…అయితే పేదరికమే గెలిచి ఓ యువకుడి చదువును అర్ధాంతరంగా ముగిసే స్థాయికి చేరింది. అయితే ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన జీవితంలో కొత్త వెలుగులు నింపేదుకు తగు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లోని సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన కల్లెం సల్మన్ రాజుకు ఉన్నత చదువులపై ఆసక్తి ఉంది. ఆమె తండ్రి పలు ఇండ్లల్లో పనిచేస్తూ ఉండగా ఆయన తండ్రి హమాలి. సాల్మన్ కంటే పెద్దదైన సోదరికి అనారోగ్యం కారణంగా ఇంటి పట్టున్నే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆయనకు చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ…పరిస్థితుల కారణంగా తండ్రి చదువు మానేయాలని ఆదేశించాడు. అయితే తనకు చదవుకోవాలని, తమ కుటుంబ స్థితిగతులను మార్చాలనే ఆలోచన ఉందని పేర్కొంటూ అంకుల అనే సేవా సంస్థకు దరఖాస్తు చేశారు. అయితే దీనికి ఆ సంస్థ మంత్రి కేటీఆర్‌కు విన్నవించింది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ‘పేదరికం కారణంగా విద్య ఆగిపోవద్దు. ఉన్నత చదువుతో తన జీవితాన్ని మార్చుకోవాలనే ఆయన కోరికను పూర్తి సహకారం అందిస్తాం. నా కార్యాలయ సిబ్బంది తగు సహాయం చేస్తారు’ అని పేర్కొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌కు చెందిన బృందం ఆ కుర్రాడితో మాట్లాడి డిగ్రీ చదువుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టింది.
Will make sure the student gets his opportunity to fulfill his dreams by completing his education. Poverty shouldn’t be an impediment to pursue excellence
Kindly ask him to contact my @KTRoffice or leave his number so we can contact https://t.co/YT5UFgxqcb
— KTR (@KTRTRS) April 29, 2018