ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడ్ని అని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో తీసుకొని నిర్ణయాన్ని జగన్ తీసుకొని బాబు అండ్ బ్యాచ్ ను ఇరుకులో పడేశారు.అసలు విషయానికి గత నాలుగున్నర నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.
అందులో భాగంగా జగన్ జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన గ్రామం పామర్రు నియోజకవర్గంలో నిమ్మకూరు లో పాదయాత్ర చేస్తున్నారు జగన్ .ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాము అని హామీ ఇచ్చారు .
అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారును ఆ పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కానీ ..రాజధానికి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెల్సిందే .అయితే ఆయన చనిపోయిన నాటి నుండి నేటివరకు బాబు చేయలేని పనిని జగన్ చేస్తా అని అనడం జిల్లా ప్రజలతో పాటుగా టీడీపీ నేతలను ఆనందానికి గురిచేసిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..