Home / ANDHRAPRADESH / ఛార్లెస్ శోభ‌రాజ్‌ను మించిన చంద్ర‌బాబు..!!

ఛార్లెస్ శోభ‌రాజ్‌ను మించిన చంద్ర‌బాబు..!!

ఛార్లెస్ శోభ‌రాజ్‌, తెలుగు జ‌నాల‌కు ఈ పేరు బాగా తెలుసు. అస‌లు ఆయ‌న ఎవ‌రో తెలియ‌క‌పోయినా రాజ‌కీయ నాయ‌కులు తిట్టుకోవ‌డానికి, నీవు గ‌జ‌దొంగ చార్లెస్ శోభ‌రాజ్‌ను మించిన వాడ‌వ‌ని అంటూ ఉంటారు. ఇంత‌కీ చార్లెజ్ శోభ‌రాజ్ అంటే నిజంగా అంత పెద్ద గ‌జ‌దొంగా..? నిజ‌మే, మోస్ ఇంటెలిజెంట్ క్రిమిన‌ల్ ఛార్లెస్ శోభ‌రాజ్‌. ప్ర‌పంచంలోనే ఇంత తెలివైన హంత‌కుడు, దొంగ‌, రాక్ష‌సుడు మ‌రొక‌రు ఉండరు. ఫారెన్‌లో ఛార్లెస్ శోభ‌రాజ్ అనే పేరుకంటే బికినీ కిల్ల‌ర్ త్రాచుపామంటేనే చాలామందికి తెలుస్తుంది. ప్ర‌పంచంలో కిల్ల‌ర్ సెల‌బ్రెటీ ఎవ‌రైనా ఉన్నారా..? అంటే.. అది ఛార్లెస్ శోభ‌రాజ్ మాత్రమే. అస‌లు ఆయ‌న హిస్ట‌రీ ఏమిటో ఒక్క‌సారి తిర‌గేద్దాం.

ఛార్లెస్ శోభ‌రాజ్‌కు ఇప్పుడు 73 ఏళ్లు. ఖాట్మాండు జైల్లో చిప్ప‌కూడు తింటున్నాడు. పుట్టింది వియాత్నాంలో. తండ్రి ఇండియ‌న్‌. త‌ల్లి వియాత్నాకు చెందిన మ‌హిళ‌. ఛార్లెస్ చిన్న‌త‌న‌మంతా సాధార‌ణ కుర్రాడిగా వియాత్నాంలోని గ‌ల్లీల్లోనే గ‌డిచిపోయింది. కానీ తెలివైన వాడు అనేకంటే.. చురుకైన వ్య‌క్తి అని చెప్పొచ్చు. న‌చ్చింది నేర్చుకోవ‌డానికి ఎంత‌కైనా తెగిస్తాడు. అత‌ని త‌ల్లి, తండ్రిని వ‌దిలేసి ఫ్రాన్స్‌కు చెందిన ఒక ఆర్మీ ఆఫీస‌ర్‌ను పెళ్లి చేసుకుంది. ఇక ఆమెతోపాటే.. ఛార్లెస్ శోభ‌రాజ్ కూడా ఫ్రాన్స్‌కు వెళ్లిపోయాడు. తండ్రి హాచెన్ శోభ‌రాజ్ మ‌ళ్లీ ఇండియాకు వ‌చ్చాడు. అటు త‌ల్లి కోసం ఫ్రాన్స్‌, త‌ల్లి బంధువుల కోసం వియాత్నాం. ఇక తండ్రిని చూడ‌టానికి భార‌త్‌. ఇలా మూడు దేశాలు తిరుతుంటే వాడు భార‌త్‌. మ‌న తాత ముత్తాత‌లు ఉన్నార‌ని, ఇండియాలో కూడా బాగానే బంధువుల‌ను క‌లుపుకున్నాడు. కానీ, త‌న‌కు ఫారెన్ లైఫ్ స్టైల్ ఇష్ట‌మున్నా కూడా దొంగ‌త‌నాల‌కు అది అంత సేఫ్ కాద‌నుకున్నాడు. ఎందుకంటే రెండుసార్లు దొంగ‌నాలు చేస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు. ముందుగా చిన్న దొంగ‌గా ఉన్న ఛార్లెస్ శోభ‌రాజ్ ప‌రిష్య‌స్ మ‌హిళ చెంత‌ల్ కోప‌నంగాస్‌ను చేసుకున్నాక క్రైంలో ఆరితేరిపోయాడు. ఇద్ద‌రూ క‌లిసి యూర‌ప్‌ను ఒక ఆట ఆడుకున్నాడు. అయితే, వారు ఏ దేశంలో ఉన్నా కూడా ఫార్న‌ర్స్‌నే టార్గెట్ చేసుకుంటారు. ఫ్రాన్స్‌లో ఒక‌సారి దొంగిలించిన కారులో భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ షికారు చేస్తుంటే పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆ కేసులో ఎనిమిది నెల‌ల జైలు శిక్ష అనుభ‌వించాడు ఛార్లెస్ శోభ‌రాజ్‌. ఇక ఆ త‌రువాత మ‌రింత రాటు దేలాడు. మ‌రోసారి టూరిస్టుల‌ను దోచుకుంటూ ఉండ‌గా పోలీసుల‌కు చిక్కిన‌ట్టే చిక్కి త‌ప్పించుకున్నాడు. పోలీసులు ఎలాగైనా అరెస్టు చేస్తార‌నే భ‌యంతో భార్య‌ను కూడా తీసుకొని ఇండియాకు తిరిగొచ్చేశాడు.

అప్ప‌టికే ఛార్లెస్ శోభ‌రాజ్ భార్య చెంత‌ల్ గ‌ర్భం దాల్చింది. 1970లో ముంబైలో దిగిన కొద్ది రోజుల‌కే చెంత‌ల్ ఒక పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆమె పేరు ఉషా. అయితే, ఛార్లెస్ శోభ‌రాజ్ ఇండియాకు వ‌చ్చాక పోలీసుల‌కు లంచాలు ఇచ్చి దొంగ‌త‌నాలు చేయ‌డంలో మ‌రింత స్పీడ్ పెంచాడు. దోపిడీలు కూడా పెరిగాయి. కానీ, సంపాద‌న స‌రిపోలేద‌నుకున్న ఛార్లెస్ శోభ‌రాజ్‌. ఫారెన్ టూరిస్ట్‌ల‌ను టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అంత‌కు ముందు చాలా మంది విదేశీయుల‌ను బోల్తా కొట్టించి బాగానే దోచుకున్నాడు. కానీ, పోలీసుల‌కు మాత్రం చిక్క‌లేదు. ఫారెన్ టూరిస్ట్‌ల‌ను బోల్తా కొట్టించ‌డంలో ఛార్లెస్ శోభ‌రాజ్ దిట్ట‌. ఎందుకంటే.. త‌న‌కు ఏడు భాష‌లు అన‌ర్గ‌ళంగా వ‌స్తాయి. అంతేకాకుండా, ఆ ఏడుభాష‌ల్లో సాహిత్యంపై కూడా ఛార్లెస్ శోభ‌రాజ్‌కు మంచి అవ‌గాహ‌న ఉంది. ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, నేపాలి, వియాత్నామీ, చైనీస్ కూడా వ‌చ్చు. ఎక్క‌డ‌కు వెళ్లినా స్థానిక భాష‌ల‌ను నేర్చుకునేందుకు ఆస‌క్తి చూపుతాడు ఛార్లెస్ శోభ‌రాజ్‌. అది భాష‌మీద ఉన్న ప్రేమ‌తో కాదు.
కేవ‌లం దొంగ‌త‌నాల కోసం.

కానీ, కేవ‌లం ఢిల్లీలోని అశోక్ విక్ర‌యం అనే హోట‌ల్లో ఒకేసారి 40 మందికిపైగా ఫ్రాన్స్‌ టూరిస్టుల‌ను దోచుకోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. అంద‌రికీ మ‌త్తు మందు ఇచ్చాడు. అంద‌రూ మ‌త్తులోకి జారుకున్నాక పాస్‌పోర్టులు, డ‌బ్బు, న‌గ‌లు దోచుకోవాల‌నుకున్నాడు. ఇక త‌న‌కు అన‌ర్గ‌ళంగా ఫ్రెంచ్ వ‌చ్చు. పైగా తాను కూడా ఫ్రాన్స్‌లో పుట్టి పెరిగాన‌ని చెప్పి వాళ్ల‌లో ఒక‌డిగా మెల‌గ‌గ‌లిగాడు. కానీ, మ‌త్తుమందు డోస్ లు ఇవ్వ‌డంలో పొర‌పాటు దొర్లింది. మ‌త్తులోకి వెళ్ల‌కుండా అంద‌రూ వాంతులు చేసుకుని ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఆ వెంట‌నే హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వీదేశీయులు కావ‌డంతో భ‌య‌ప‌డ్డ హోట‌ల్ యాజ‌మాన్యం.. ఎం జ‌రిగిందో తెలీయ‌క భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నిందితుల‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో అనుమానంగా క‌నిపించ‌డంతో ఛార్లెస్ శోభ‌రాజ్ పోలీసుల‌కు చిక్కాడు. భార్య‌తో క‌లిసి దేశాన్ని విడిచి వెళ్లిపోవాల‌నుకున్నాడు. ఆ త‌రువాత కేసు కోర్టు విచార‌ణ‌లో ఉండ‌గానే తండ్రి సాయంతో బెయిల్ తెచ్చుకుని కాబూల్‌కి చెక్కేశాడు శోభ‌రాజ్‌. కానీ, అక్క‌డ కూడా బుద్ధిమార్చుకోకుండా టూరిస్టుల‌ను దోచుకుంటూ టూరిస్టుల‌ను దోచుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్న ఛార్లెస్ శోభ‌రాజ్ పోలీసుల‌కు స‌మాచారం తెలియ‌డంతో.. భార్య‌ను వ‌దిలేసి కాబూల్ నుంచి ఇరాన్ పారిపోయాడు.

ఇక, ఈ దొంగ‌త‌నాలు వ‌ద్దు.. క్రిమిన‌ల్ బ్యాక్ గ్రౌండ్‌తో త‌న బిడ్డ జీవితం పాడైపోతుంద‌ని ఛార్లెస్‌ను వ‌దిలేసిన చింత‌ల్ ఫ్రాన్స్ వెళ్లిపోయింది. ఇక ఆ త‌రువాత చార్లెస్ జీవితంలోకి రాలేదు. ఆ త‌రువాత ఛార్లెస్ దొంగ పాస్‌పోర్టుల‌తో చాలా దేశాలే తిరిగాడు. ఎయిర్ పోర్టులో ఛార్లెస్ మీద ఎవ‌రికీ అనుమానం రాదు. ఎందుకంటే ఛార్లెస్ ఆజాను బాహుడు, అంద‌గాడు. క‌ళ్ల‌జోడు లేకుండా కాళ్లు బ‌య‌ట‌పెట్ట‌డు. అలాగే, ఇస్తాంబుల్‌లో త‌న త‌మ్ముడితో క‌లిసి నేరాలు చేయ‌డం మొద‌లు పెట్టాడు. కానీ, ఏజెన్సీ పోలీసులు క్ష‌ణాల్లో ఛార్లెస్‌ను ప‌ట్టుకున్నారు. అప్పుడు కూడా ఛార్లెస్ త‌ప్పించుకున్నాడు. కానీ అత‌ని త‌మ్ముడు మాత్రం పోలీసుల‌కు ప‌ట్టుబ‌డి పోయాడు. దాదాపు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభ‌వించాడు. కానీ, ఛార్లెస్ ఇండియాకు మారువేశంలో వ‌చ్చి ఢిల్లీలోని ఒక హోట‌ల్లో అమెరికన్ టూరిస్టును చంపి దోచుకున్నాడు. ఆ త‌రువాత మ‌రో ఇద్ద‌రిని బ్యాంకాక్‌లో చంపి దోచుకున్నాడు. ముంబైలో న‌లుగురిని హ‌త్య చేశాడు. ఒక టూరిస్ట్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి హోట‌ల్ గదిలోకి వెళ్ల‌గానే.. ఆమెను చంపేసి.. ఆమెను కూడా దోచుకున్నాడు. ఇలా దాదాపు 24 మందికి పైగా చంపాడు ఛార్లెస్ శోభ‌రాజ్‌.

అన్ని చోట్లా ఒక‌టే స్టైల్ మ‌త్తుమందు ఇవ్వ‌డం దోచుకోవ‌డం. ఆ త‌రువాత గొంతు నుమిలి చంపేయ‌డం. ఇలా అన్ని చోట్లా త‌ప్పించుకున్నా కూడా ఇండియాలో మాత్రం అత‌నికి 21 సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డింది. కానీ, జైల్లో గార్డుల‌కు లంచాలు ఇచ్చి ల‌గ్జ‌రీ లైఫ్ లీడ్ చేశాడు. టీవీ, ఏసీ ఏర్పాటు చేసుకుని రాజ‌భోగం అనుభ‌వించాడు. అంతేకాదు, గార్డులు బాగా క్లోజ్ అయ్యాక వారికి కూడా మ‌త్తు మందు ఇచ్చి తీహార్ జైలు నుంచి త‌ప్పించుకున్నాడు ఛార్లెస్ శోభరాజ్‌. కానీ, పోలీసులు తెలివిగా వ్య‌వ‌హ‌రించి ఛార్లెస్ శోభ‌రాజ్‌ను మ‌ళ్లీ ప‌ట్టుకుని తీహార్ జైల్లో పెట్టారు. చేసేది లేక 21 ఏళ్లు జైలు శిక్ష అనుభ‌వించిన ఛార్లెస్ శోభ‌రాజ్ బ్యాంకాక్‌లో ముగ్గురిని చంపి నేపాల్ వ‌చ్చాడు. ఖాట్మాండ్‌లో ఒక‌సారి జ‌ర్న‌లిస్ట్ కంట్లో ప‌డ‌టంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వ‌ల‌ప‌న్ని మ‌రీ ఛార్లెస్‌ను మ‌ళ్లీ ప‌ట్టుకున్నారు. నేపాల్‌లో ఒక‌రిని చంపావ‌ని పోలీసులు వారించారు. అస‌లు ఆ దేశంలో నేను లేన‌ని చార్లెస్ చెప్పినా పోలీసులు ప‌ట్టించుకోలేదు. కోర్టు అత‌నికి యావ‌జ్జీవ‌కారాగార శిక్ష వేసింది. అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్.

జైల్లో త‌న‌కు ముందే ప‌రిచ‌య‌మైన పాతికేళ్ల నీతా బిహ్వాస్‌ను పెళ్లి చేసుకున్నాడు. జైల్లోని ఛార్లెస్‌ను పెళ్లి చేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది నీతా బిహ్వాస్‌. ఆమె త‌ల్లి లాయ‌ర్‌. జైల్లో ఉన్న 73 ఏళ్ల అల్లుడిని (ఛార్లెస్‌ను) బ‌య‌టికి తీసుకురావ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఛార్లెస్ శోభ‌రాజ్ అత్త వ‌య‌సు 50 ఏళ్లు. కానీ, ఆమె గ‌ర్వంగా త‌న‌కు 73 ఏళ్ల అల్లుడు ఉన్నాడ‌ని చెప్పుకుంటుంది. ఛార్లెస్ శోభ‌రాజ్ ఎన్నో క‌థ‌లు సినిమావాళ్ల‌కు అమ్ముకున్నాడు. ర‌ణ‌దీప్ హీరోగా వ‌చ్చిన మై ఔర్ ఛార్లెస్ సినిమా అత‌ని జీవిత చ‌రిత్ర ఆధారంగా వ‌చ్చిందే. ఇప్పుడు బయోగ్ర‌ఫీ రాస్తున్నాడు. నాలుగు కోట్ల‌కు అమ్మ‌కోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా మంచి ప‌బ్లిషింగ్ ఏజెంట్ దొక‌డం లేదు. ఇక త‌న‌ను వ‌దిలేయాల‌ని నేపాల్ స‌ర్కార్‌కు విన్నవించుకుంటున్నాడు. 72 ఏళ్లు దాటిన వాళ్ల‌ను జైలు నుంచి వ‌దిలేయాల‌ని నేపాల్ కొత్త చ‌ట్టం తీసుకొచ్చింది. కానీ, శోభ‌రాజ్‌ను మాత్రం వ‌దిలేందుకు నేపాల్ స‌ర్కార్ ఒప్పుకోవ‌డం లేదు. దీంతో కోర్టుల్లో కేసులు వేసి అల్లుడు ఛార్లెస్‌ను విడుద‌ల చేయించుకునే ప‌నిలో ఉంది అత‌ని అత్త‌. మ‌రి ఛార్లెస్ శోభ‌రాజ్ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తాడా..? లేదా అనేది భ‌విష్య‌త్తే నిర్ణ‌యించాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat