కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి సంబంధాలున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు సీబీఐ, ఈడీ అధికారులు సేకరించారని, త్వరలో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చంద్రబాబు అవినీతి భాగోతం అంతటితో ఆగలేదు.. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పేరుతో బాగానే సొమ్మును వెనకేసుకున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. చంద్రబాబు అవినీతిలో అతని మంత్రివర్గానికి కూడా వాటా ఉందన్నది విమర్శకుల మాట.
అయితే, ఈ మాటలనే రుజువు చేస్తూ సీఎం చంద్రబాబు కేబినేట్‌కు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రూ.650 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతి భాగోతాన్ని బయటపెట్టింది ఎవరో కాదండి బాబూ… స్వయాన సీబీఐ అధికారులే. అయితే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తన కేబినేట్ మంత్రుల అవినీతి కార్యకలాపాలను ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చేందుకు ముమ్మర దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు మొదటగా మంత్రి పుల్లారావు అవినీతి కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ అవినీతి భాగోతమంతా ప్రత్తిపాటి పల్లారావు వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరగడం విశేషం.
అయితే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రూ.650 కోట్ల అవినీతి కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. !
2014 – 15 సంవత్సరం మధ్యన ఏపీలో పత్తి కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ 650 కోట్లు రూపాయల మేర నష్టపోయింంది. సీసీఐ అంత భారీ మొంత్తంలో నష్టపోవడానికి గల కారణాలపై ఆరా తీసిన సీబీఐ అధికారులకు కళ్లుబయర్లు కమ్మే వాస్తవాలు తెలిసాయి.
అవేమిటంటే..! నాడు రాష్ట్ర టీడీపీ మంత్రులు, దళారులతో కుమ్మక్కై ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ నాణ్యమైన పత్తిలో.. నాశిరకమైన పత్తిని కలిపి సీసీఐ కేంద్రానికి విక్రయించినట్లు తెలిసింది. 2014 – 15 మధ్యన ఈ వార్త ఏపీలో పెను సంచలనమే రేపింది. ఇలా, నాణ్యతగల పత్తిలో కలిపిన నాసిరకం పత్తిని కొనుగోలు చేయడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ రూ.650 కోట్లు నష్టపోయింది. దీనిపై చంద్రబాబు సర్కార్ విచారణ కమిటీ వేసినప్పటికీ.. సీసీఐ నష్టాలు రావడానికి గల ప్రధాన కారణాన్ని చెప్పకపోగా.. దోషులుగా పేర్కొన్న 26 మంది ప్రభుత్వ అధికారులపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కుంభకోణంలో ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ప్రధాన నిందితుడుగా సోషల్ మీడియా కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానికి వచ్చిన సీబీఐ ప్రత్యేక విచారణ బృందం.. గుంటూరులోని సీసీఐ కేంద్రంలో విచారణను ప్రారంభించింది. గత వారంలో విశాఖలో దిగిన సీబీఐ ప్రత్యేక బృందం.. విచారణ నిమిత్తం గుంటూరుకు చేరుకుంది.