పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువైన భూమిలో సీఎం క్యాంపు కడుతుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.
కమీషన్లకు కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సీఎం కేసీఆర్ సొంత ఆస్తి కాదనే కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ దద్దమ్మలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒకసారి మాత్రమే ప్రత్యేక విమానంలో చైనా, సింగపూర్ వెళ్లారని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా మలేషియా వెళ్లారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ సీఎంలు ఆరునెలలకు ఒకసారి ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లేవారని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలు ఎన్ని దేశాల్లో పర్యటిస్తున్నారో వివరాలు తెప్పించుకోవాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తలసాని ప్రకటించారు.