ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా కు ఉరి వేసిన ఘనుడు చంద్రబాబే అని విమర్శలు గుప్పించారు .ధర్మ పోరాటం పేరిట చంద్రబాబు చేసింది అంతా డ్రామా మాత్రమేనని మోడీ సర్కార్ తో మరోసారి లాలూచీ కి టీడీపీ పార్టీ తహతహలాడుతుందని అన్నారు . స్వార్థ ప్రయోజనాలకు టీటీడీ బోర్డును వినియోగించుకుంటున్నారని..అందుకే బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డ్ పదవి ఇచ్చారని రోజా అన్నారు.
హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఒక్క జగనే అని..ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అవిరామంగా పోరాడుతున్న వైసీపీ చేసిన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించ లేదా?. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకుని.. చిదంబరం, సోనియా కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై కుట్రపన్నారు.ఆ రోజు ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. గత నాలుగేళ్లలో స్వప్నకు టీటీడీలో చోటు కల్పించకుండా ఇప్పుడే ఎందుకు ఇచ్చారు?. పాలకమండలిలో సభ్యురాలిగా చేరేందుకు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు లేరా?’ అంటూ చంద్రబాబును రోజా నిలదీశారు .