ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటికీ టీడీపీ నేతలు చేయని నేరాలు, దాడులు, ఘోరాలు లేవు. ఆఖరికి ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను, స్థానిక ఓటర్లను వేధిస్తూ, కనీసం మహిళలని కూడా చూడకుండా దాడులకు తెగ బడుతున్నారు. అంతేకాకుండా, టీడీపీ అవినీతిని ప్రశ్నించిన ప్రభుత్వాధికారులను సైతం వదలడం లేదు. వారిపై కూడా దాడులకు తెగబడుతున్నారు పచ్చ నేతలు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడటమే ఇందుకు ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also : వైసీపీ సర్పంచ్‌పై మారణాయుధాలతో హత్యాయత్నం..!!
ఇటీవల కాలంలో తాడిపత్రిలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డిపై అక్రమ హత్యాయత్నం కేసుపెట్టిన టీడీపీ సర్కారు తాజాగా కర్నూలు జిల్లా సుభాష్‌పురం వైసీపీ సర్పంచ్ హనుమంతుపై హత్యాయత్నం జరిగింది. కాగా, పత్తికొండ నుంచి బైక్‌పై వెళ్తున్న హనుమంతును కొందరు టీడీపీ నేతలు జీపుతో వెంబడించి, ఆ పై బైక్‌ను ఢీకొట్టి మారణాయుధాలతో హనుమంతుపై దాడి చేసి హత్యచేసేందుకు యత్నించారు. అయితే, దుండగుల దాడి నుంచి తప్పించుకున్న సర్పంచ్ హనుమంతును స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
see also : వైసీపీ ప్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో ..!
ఆ సంఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. కాగా, తీర్మానం లేకుండా నిధులు విడుదల చేయాలంఆటూ పీసీపల్లి మండలం పరిధిలోగల పడమటిపల్లి పంచాయతీ వార్డు మెంబర్ సుబ్బయ్యపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో, తీర్మానం లేకుండా నిధులు విడుదల చేసేందుకు నిరాకరించిన వార్డు మెంబర్ సుబ్బయ్యను, అతని భార్య రమణమ్మను నడి రోడ్డుపైకి లాక్కొచ్చి మరీ టీడీపీ నేతలు మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడి జరిగిన అనంతరం సమాచారం తెలుసుకున్న వైసీపీ నాయకులు మధుసూదన్ యాదవ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సుబ్బయ్య, రమణమ్మలను పరామర్శించి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. అయితే, తనపై దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వార్డు మెంబర్ సుబ్బయ్య తెలిపారు.