Home / POLITICS / కేంద్రం బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన మంత్రి కేటీఆర్

కేంద్రం బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన మంత్రి కేటీఆర్

అభివృద్ధి, సంక్షేమం అజెండాగా సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధంగా అడ్డుపుల్ల‌లు వేస్తోందో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత మ‌రోమారు బ‌య‌ట‌పెట్టారు. ఐటీ రంగానికి కీల‌క‌మైన ఐటీఐఆర్ విష‌యంలో కేంద్రం తీరును ఇప్ప‌టికే అనేక వేదిక‌ల‌పై బ‌ట్ట‌బ‌య‌లు చేసిన కేటీఆర్ తాజాగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి విష‌యంలో కేంద్రం తీరును బ‌హిరంగంగానే ఎండ‌గ‌ట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని  చెప్పారు. అయితే కేంద్రం తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చే విధంగా తాము ప్రణాళిక‌లు ర‌చిస్తే కేంద్రం అడ్డుప‌డుతోంద‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. సికింద్రాబాద్ పారడైజ్ నుంచి తూముకుంట, ప్యాట్నీ సెంటర్ నుంచి కొంపల్లి సుచిత్రవరకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రెండు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రతిపాదనలతోపాటు రూ.2500కోట్ల నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. వీటి నిర్మాణానికి కంటోన్మెంట్ ఆధీనంలోని వంద ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని తెలిపారు. అయితే, స్థలాన్ని ఇచ్చే విషయంలో రక్షణశాఖ మూర్ఖంగా వ్యవహరిస్తూ పనులకు మోకాలడ్డుతున్నదని మంత్రి విమర్శించారు. రక్షణశాఖ ఇచ్చే వంద ఎకరాలకు బదులుగా వారుకోరినట్టు మరోచోట 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయినా రక్షణశాఖ వినకుండా ప్రత్యామ్నాయ భూమితోపాటు ఏటా రూ.30 కోట్ల చొప్పున చెల్లిస్తేతప్ప తాము తమ స్థలాన్ని వదులుకునేది లేదంటూ మొండిగా వ్యవహరిస్తున్నదని మంత్రి తెలిపారు.

ఎక్స్‌ప్రెస్‌వేల కోసం ప్రతిపాదిత 100 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కనీసం రూ.30కోట్లవరకు అద్దెలు వచ్చే వీలున్నందున ఆ మేరకు ప్రభుత్వం ఎల్లకాలం రూ.30కోట్ల చొప్పున తమకు చెల్లించాలని రక్షణశాఖ కోరుతున్నదని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు వివరించారు. రక్షణశాఖ తరచూ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లను మూసివేస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకే తాము ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రతిపాదించగా, కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా మొండివైఖరి అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని, నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రక్షణశాఖ వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat