ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కార మార్గాల అధ్యయనానికి ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర.. ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. అంతేకాకుండా, జగన్ ఎక్కడ సభ పెట్టినా ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలన్నిటిలో అవినీతి జరుగుతోందని, నిరుద్యోగులు అయితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వదల్లేదని, వృద్ధులయితే.. చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు పింఛన్‌లోనూ లంచం అడుగుతున్నారని వారి.. వారి ఆవేదనను జగన్‌తో చెప్పుకుని విలపిస్తున్నారు. ప్రజల సాదకబాధలను విన్న వైఎస్ జగన్ వారిని ఓదారుస్తూ, ప్రత్యేక హోదాపై గళమెత్తుతూ ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు పోతున్నారు.
see also : టీడీపీలోకి బీజేపీ నేత ..!
ఇదిలా ఉండగా. ఇటీవల సీఎం చంద్రబాబు జన్మదినం రోజున ప్రత్యేక హోదా కోసమంటూ విజయవాడలో నిర్వహించిన ఆత్మగౌరవ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు ప్రజల నుంచి ఊహించిన స్థాయిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనికంతటికి కారణం టీడీపీ ప్రభుత్వం అవినీతి, సామాన్యులపై చేస్తున్న దాడులన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేగాక, గత నాలుగేళ్లు అధికారంలో అనుభవిస్తున్న సమయంలో గుర్తుకు రాని ప్రత్యేక హోదా.. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో గుర్తొచ్చిందా..? అంటూ ఏపీ ప్రజలు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
see also : సీన్ రిపీట్.. ”జగన్ హుషారు – చంద్రబాబు బేజారు”..!!
ఇదిలా ఉండగా.. ఆత్మగౌరవ దీక్షతో అట్టర్ ప్లాప్ అయిన చంద్రబాబు.. మళ్లీ మరో నాటకానికి తెర తీశారు. అదే తిరుపతిలో చంద్రబాబు మరో సభ. అసలే, ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను వంచించిన తీరు.. టీడీపీ సర్కార్ అవినీతి.. ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తలపెట్టిన ఆత్మగౌరవ దీక్ష అట్టర్ ప్లాప్ కాగా.. మళ్లీ ఇంకో సభ అవసరమా..? చంద్రబాబు అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరో పక్క, తిరుపతిలో జరగనున్న సభకు ప్రజలను తరలించే బాధ్యతను ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు అప్పగించారట చంద్రబాబు. ప్రతీ కుటుంబం వచ్చేలా సీఎం చంద్రబాబు ప్రభుత్వ నిధులను భారీగానే ఖర్చు చేస్తున్నారంటూ చిత్తూరు జిల్లా ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా, విజయవాడ సభ గతం.. తిరుతిలో జరగనున్న సభకు మాత్రం భారీగా జనాల్ని తరలించాలని, లేకుంటే మీ అంతు చూస్తానంటూ టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్ర్టాంగ్ వార్నింగే ఇచ్చారన్నది ఆ పార్టీ శ్రేణుల మాట.