ఏపీలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పార్టీలు కల్సి బరిలోకి దిగిన సంగతి విధితమే.అయితే రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గత నాలుగేండ్లుగా కల్సి ఇరువురు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి బై బైలు చెప్పుకున్న సంగతి కూడా తెల్సిందే.అయితే తాజగా బీజేపీ పార్టీ తరపున గత ఎన్నికల్లో రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓటమి పాలైన మాజీ పోలీసు అధికారి కారుమంచి జయరామ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు .త్వరలో తిరుపతిలో జరిగే టీడీపీ పార్టీ బహిరంగ సభలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు …
