తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ మహానగరం తార్నాకలోని ఐఐసీటీలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ యువ శాస్తవేత్త లకు అవార్డులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని .. శాస్త్ర, సాంకేతిక ఫలాలు సామాన్య ప్రజలకు అందాలని చెప్పారు.ఇస్రో 100 ఉపగ్రహాలకు పైగా ఒకేసారి నింగిలోకి పంపటం ఎంతో గర్వకారణమని తెలిపారు.హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
IT & Industries Minister @KTRTRS addressing the Scientists and Scholars at the Telangana Academy of Sciences’ ‘Presentation of Young Scientist Awards-2017’ program at Indian Institution of Chemical Technology (IICT) campus in Hyderabad. pic.twitter.com/SPm3VXmIaJ
— Min IT, Telangana (@MinIT_Telangana) April 28, 2018