తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఊరటనిచ్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించిన ఎన్నికల అడవిపిట్ లో విద్యార్హతను తప్పుగా డిక్లరేషన్ ఇచ్చారంటూ అప్పట్లో ప్రస్తుత అధికార
టీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆ అడవిపిట్ లో ఎమ్మెల్యే బీఈ పాస్ కాకుండానే పాస్ అయినట్లు ప్రకటించుకున్నారు అని హైకోర్టుకు తెలిపారు.దీంతో మూడేండ్ల నుండి విచారణ కొనసాగుతుంది.శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీచేసింది ..