ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హోరోగా ,కైరా అద్వాని హిరో యి న్ గా జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవల భరత్ అనే నేను చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించిన సంగతి తెలిసిందే.
సినిమా బాగా నచ్చడంతో తన ట్విట్టర్ లో మహేష్ మరియు కొరటాల శివని అభినందించారు.అయితే ఈ సినిమా తన రియల్ లైఫ్‌కి కూడా కాస్త దగ్గరగా ఉండడంతో మూవీ హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివతో కలిసి ఇంటరాక్షన్ జరిపారు. సినిమాలో ఉన్న అంశాలతో పాటు రియల్ లైఫ్ లో తాను ఫాలో అవుతున్న పద్దతులు గురించి చర్చించారు. ఆ వీడియో తాజాగా విడుదలైంది. ఆ వీడియో మీకోసం..