నవ్యాంధ్ర ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఫోటోను వైసీపీ ప్లెక్సీల మీద ఉండటం ఎప్పుడు అయిన చూశారా .అదే జరిగింది ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి మండలం పెదకమిడి గ్రామంలో .
స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఒకపక్క టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ,మరోపక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలుండగా మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు .దీంతో ఆ గ్రామంలో అధికార టీడీపీ పార్టీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..