నెల్లూరు రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, అలాగే దమ్మున్న నేతగా అనీల్ కుమార్ యాదవ్ ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న అనీల్ కుమార్ యాదవ్‌కు ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా జిల్లాలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది.
see also : భూమా ఫ్యామిలీ పొలిటికల్ ఛాప్టర్ క్లోజ్..!!
వైసీపీ నుంచి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఢీ. .అంటే ఢీ అంటూ పోరాడే నాయకుల్లో ఒకరు కొడాలి నాని, మరొకరు రోజా కాగా, ఆ లిస్టులో అనీల్ కుమార్ యాదవ్ పేరు ఉండాల్సిందే. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు మరో యంగ్ అండ్ డైనమిక్ నాయకుడితో జోడీ కడితే ఎలా ఉంటుంది. రాజకీయం రంజుగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. అలాంటి అనీల్ యాదవ్ జగన్‌కు విధేయుడిగా ఉంటున్నారు. డాక్టర్ చదివినప్పటికీ.. రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం తన తండ్రి అని చెప్పుకునే అనీల్ కుమార్ యాదవ్ ప్రతీ ఒక్క బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదవాలనే ఆశయంతో.. ఆ దిశగా కార్యాచరణను రూపొందిస్తూ ముందుకెళుతున్నారు.
ఇదిలా ఉండగా.. అనీల్ కుమార్ యాదవ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందన్నారు. కృష్ణా జిల్లా మా అడ్డా.. విజయవాడ మా అడ్డా,మా అడ్డా అని చెప్పుకునే టీడీపీ.. ఎప్పుడైతే.. ప్రజా సంకల్ప యాత్రతో జగన్ కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడో.. అప్పుడే కృష్ణా జిల్లా వైసీపీ అడ్డా అయిపోయిందన్నారు. మరో ఎనిమిది నెలల్లో వైఎస్ జగన్‌ను సీఎంగా చూడబోతున్నారంటూ అనీల్ కుమార్ యాదవ్ ఎంతో ఆవేశంగా చెప్పారు. వైఎస్ జగన్ సీఎం కాగానే.. చంద్రాబు పాల్పడ్డ అవినీతి చిట్టాలన్నిటిని ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చి.. టీడీపీ నేతలను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపుతామన్నారు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.
అంతేకాకుండా, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపుకోసం తనవంతుగా నిరంతరం కృషి చేస్తున్నానని, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెన్నంటే ఉంటానంటూ మీడియా ముఖంగా చెప్పారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం వారీగా సమావేశాలు నిర్వహించి.. ప్రతీ కార్యకర్తతో చర్చలు జరుపుతున్నామని, 2019లో వైసీపీ గెలవడం, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమంటూ మీడియా ముఖంగా చెప్పారు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.