తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రో.కోదండ రాం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారబాద్ లో సరూర్ నగర్ లో ఆయన ఇటివల ప్రకటించిన తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ప్రో కోదండ రాం తీసుకున్న తాజా నిర్ణయం పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది .
అందులో భాగంగా కోదండ రాం ఈ రోజు శనివారం సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ ఎదురుగ ఉన్న గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి టీజేఏసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు .అయితే తను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కానీ టీజాక్ కొనసాగుతుందని గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే .