తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ ప్రతినిధులతో కొంపల్లి బీబీఆర్ గార్డెన్‌లోని ప్లీనరీ ప్రాంగణం కళకళలాడింది. రాష్ట్రంలోని అన్ని దారులు కొంపల్లి వైపే అన్న తీరులో సందడి వాతావరణం నెలకొన్నది. దారిపొడవునా వెలిసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలతో టీఆర్‌ఎస్ శ్రేణులు సందడి చేశారు.
ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మొత్తం గులాబీమయమైంది.నగరంలో ప్లీనరీ జరిగే ప్రదేశం కొంపల్లి కి వెళ్ళే దారులల్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్లు,రౌండ్ అర్చేస్,మెట్రో పిల్లర్స్ పై ఏర్పాటు చేసిన హోడింగ్స్ ,బస్టాప్ ల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ,నగరంలో ఏర్పాటు చేసిన బెలున్స్ పార్టీ శ్రేణులను ఎంతగానో ఆకర్షించాయి .ఈ సందర్భంగా ప్లీనరీ విజయవంతంగా పూర్తిచేయడం వెనుక కృషిచేసిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక కృషిని ఈసందర్భంగా కేసీఆర్ కొనియాడారు.
ప్రత్యేకంగా అలంకరణ కమిటీకి నేతృత్వం వహించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ కు పోచంపల్లి కృతజ్ఞతలు తెలిపారు.టీఆర్ఎస్ పార్టీకి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూ.25 లక్షలను విరాళంగా అందించారు.